![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -105 లో.....కన్నా వాళ్ళ సొంత తమ్ముడు కాదన్న నిజం తెలిసి ఏడుస్తాడు. మన తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా నిన్ను ఎప్పుడైనా వేరుగా చూసామా అని మాధవ అంటాడు. ఒరేయ్ నువ్వు ఏడిస్తే మేం తట్టుకోలేమని కేశవ ఎమోషనల్ అవుతాడు. నేను సొంత తమ్ముడు కాదని.. చక్రి అన్నయ్య చూడు దూరంగా ఉన్నాడని కన్నా అంటుంటే ఒరేయ్ నిన్ను ఇలా చూడలేకపోతున్నరా అని కన్నాని పట్టుకొని చక్రి ఏడుస్తాడు. ముగ్గురు అన్నలు కన్నాని పట్టుకొని ఎమోషనల్ అవుతారు.
ఆ తర్వాత అందరు పడుకుంటారు. కన్నా మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తాడు. నా వల్లే వీళ్ళు ఇన్ని మాటలు పడ్డారని కన్నా ముగ్గురు అన్నల మొహాలు చూసి మాధవ కాళ్ళు పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. అందరు ఒక్కసారిగా నిద్ర లేచి చూసేసరికి కన్నా ఉండడు. ఇంట్లో అంతా వెతుకుతారు.. కన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని అందరికి అర్థమవుతుంది. ఆ తర్వాత అందరు కన్నాని వెతకడానికి వెళ్తారు. కన్నా ఫోటో పట్టుకొని కన్పించిన ప్రతీ ఒక్కరిని కేశవ అడుగుతాడు. చక్రి, మాధవ ఒకవైపు వెళ్తారు. ఇంట్లో మహా టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత నారాయణ పాట పాడుతూ వస్తాడు. కన్నా కన్పించాడా అని నారాయణని మహా అడుగుతుంది. నాకేం తెలుసు వాడు వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్లిపోయాడేమో అని నారాయణ అంటాడు. ఇదిగో చాపల పులుసు తీసుకొని వచ్చాను తిను అని నారాయణ అనగానే.. అది తీసుకొని కోపంగా విసిరేస్తుంది మహా. మీకు ఏం పట్టదా అన్నట్టుగా తర్వాత నారాయణపై కోప్పడుతుంది. దాంతో నారాయణ కూడా కన్నాని వెతకడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |